హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు

GDWL: ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు, పీఎల్‌ఐ  ఉపసంహరణతోపాటు, ఇతర పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెబాట పట్టారు. గద్వాలలోని ఎస్‌బీఐ ఉద్యోగులు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.