హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులు అదుపులో అనుమానాస్పద వ్యక్తులు

NTR: మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఆరుగురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న వివరాలు, వస్తువులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.