GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానది తీరాన, జాతీయ రహదారి-44పై వెలసిన పుణ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఆలయ ఈవో పురందర్ కుమార్, అర్చకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బీచుపల్లిలో అమావాస్య పూజలు


