హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొల్లూరులో రైతుల ఆందోళన

MBNR: నవాబుపేట మండలం కొల్లూరు 33/11 కేవీ సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యపై రైతులు ఆందోళన చేపట్టారు. తరచూ విద్యుత్ కోతలు, లోవోల్టేజీతో బోరు మోటార్లు కాలిపోతుండటంతో పంటలకు సాగునీరు అందక వరిపంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.