హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు పెన్షన్ గ్రీన్ సిగ్నల్

కోనసీమ: 50 ఏళ్లు నిండిన అగ్నికులక్షత్రియ మత్స్యకారులకు నెలవారీ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజోలు నియోజకవర్గంలోని మత్స్యకారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం శుక్రవారం ఫిషర్‌మెన్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. 49 మత్స్యకార సహకార సంఘాలకు చెందిన వందలాది మంది సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు.