PLD: రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గానికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వడ్డెర క్వారీ పూల్ కోసం 16 జిల్లాల్లో 32 చోట్ల కలిపి 100 హెక్టార్ల ప్రభుత్వ భూములను గుర్తించింది. వీటిని రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు లీజుకు ఇవ్వనున్నారు. అంతేకాకుండా లీజు అమౌంట్, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం భారీ రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉన్న వడ్డెర కులస్తులకు లబ్దిచేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్
వడ్డెరలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త


