హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

NDL: పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ వద్ద 9వ గేటుకు సంబంధించి తెగిపోయిన రోప్‌ను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు. సాంకేతిక లోపాల వల్ల సాగునీటి విడుదలకు ఆటంకం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రోప్‌ మరమ్మతులను మూడు రోజుల్లో పూర్తి చేసి రెగ్యులేటర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.