హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పలయ్య గౌడ్ మృతికి గొంగిడి సునిత నివాళి

BHNG: ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పల్లె ఉప్పలయ్య గౌడ్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.