హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడ్డర్‌ను ఢీకొట్టిన భారీ వాహనం

కోనసీమ: మామిడికుదురు(M) పాసర్లపూడి కైకాలపేట జాతీయ రహదారి బైపాస్ వై జంక్షన్ వద్ద భారీ వాహనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్‌ను శుక్రవారం ఉదయం ఓ భారీ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ధాటికి గడ్డర్ పూర్తిగా వంగి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు హుటాహుటిన గడ్డర్ తొలగింపు పనులు చేపట్టారు.