VZM: దత్తిరాజేరు మండలం మరడాంలో ఇవాళ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో బైక్ ఢీకొట్టడంతో స్దానిక గుగ్గిలపు నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్దానికుల వివరాల ప్రకారం.. మరడాం నుంచి VZM వైపు వెళ్తున్న ఆయనను, రామభద్రపురం నుంచి వస్తున్న గుర్తుతెలియని బైక్ వెనుక నుంచి ఢీకొట్టి వెళ్ళిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు మహారాజ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆంధ్రప్రదేశ్
బైకు ఢీ కొన్న ఘటనలో వ్యక్తికి గాయాలు


