BPT: అద్దంకి డివిజన్ సోమవరప్పాడు వద్ద బెంగళూరు హైవే నిర్మాణ ప్రాంత భూములను శుక్రవారం జేసీ కల్పనాకుమారి పరిశీలించారు. సర్వే నంబర్ 320లోని 208.75 ఎకరాల వివాదంపై కోర్టు కేసు నడుస్తుండటంతో రికార్డులను తనిఖీ చేసిన జేసీ, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, ఎమ్మార్వో, సర్వేయర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోమవరప్పాడులో భూరికార్డులు తనిఖీ చేసిన జేసీ


