హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపై కత్తితో తమ్ముడు దాడి.. కేసు నమోదు

MNCL: నెన్నెల మండలం, చిన్నవెంకటాపూర్‌లో మద్యం మత్తులో అన్నపై కత్తితో తమ్ముడు దాడి చేసినట్లు SI జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. SI వివరాల ప్రకారం దుగుట నరేష్ అతడి తమ్ముడు సురేష్ మధ్య తాగిన మైకంలో గొడవ జరిగింది. గురువారం రాత్రి నరేష్ పడుకుని ఉండగా సురేష్ కత్తితో గాయపర్చాడు. సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.