హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పశుసంవర్ధక శాఖ లక్ష్యాలు పూర్తి చేయాలి'

JN: NDLM, భారత్ పశుధన్ పోర్టల్, SASCI, గాలికుంటు వ్యాధి టీకాలు, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలపై పశుపోషకులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. భారత్ పశుధన్ పోర్టల్‌లో 40,219 మంది పశుపోషకులు నమోదయ్యారని, మరో 15,487 మందికి ఆధార్ వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ వివరాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.