ATP: గణేష్ మండపాల నిర్వహణకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శుక్రవారం తెలిపారు. వినాయక చవితి వేడుకల వేళ నిర్వాహకులపై ఆర్థిక భారం పడకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రశాంత వాతావరణంలో భక్తులు వేడుకలు జరుపుకోవాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మండపాలకు ఉచిత విద్యుత్ సంతోషకరం: ఎమ్మెల్యే


