హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాల పరిసరాల్లో చెత్త తొలగించాలి'

KDP: వేంపల్లిలోని హైస్కూల్ పరిసరాల్లో రోడ్డుపక్కన పెద్దఎత్తున చెత్త పేరుకుపోవడంతో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త కారణంగా దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలన్నారు.