హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS యూత్ నాయకుల హౌస్ అరెస్ట్

SRPT: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లకుండా మునగాల బీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులను పోలీసులు శుక్రవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.