NZB: దసరా, దీపావళి పండుగల సందర్భంగా తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక రైళ్లను మరో రెండున్నర నెలల పాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాల్నా–తిరుపతి (07814/07815) రైలు నవంబర్ 27 వరకు, నాందేడ్–తిరుచానూరు (07603/07604) రైలు నవంబర్ 25 వరకు నడవనున్నాయి. బాసర, నిజామాబాద్, ఆర్మూర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రెండు రైళ్లు పొడగింపు


