హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్

GNTR: ఈ నెల 12న అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోస్టర్‌ను విడుదల చేశారు. కోర్టు ఫీజు లేకుండా, పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.