హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు

ELR: జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఐ బి. యాదగిరి అధ్యక్షతన పోలీస్ సిబ్బందికి వారంతపు శిక్షణ నిర్వహించారు. అనంతరం జీలుగుమిల్లి సెంటర్‌లో ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ యాప్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.