ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య.. దీనినే 'పోలాల అమావాస్య'గా జరుపుకుంటారు. తమ పిల్లల ఆయురారోగ్యాలు, క్షేమం కోసం తల్లులు భక్తిశ్రద్ధలతో పోలేరమ్మను పూజించే విశిష్ట పర్వదినం. నోము దారాలను అమ్మవారి వద్ద ఉంచి పూజించి పిల్లల చేతులకు రక్షగా కడతారు. అలాగే వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే ఎడ్లను, పశువులను పూజించి తమ కృతజ్ఞత చాటుకుంటారు. కుటుంబ సంక్షేమానికి ఈ పూజ శ్రేష్టమైనదిగా భావిస్తారు.
భక్తి
పోలాల అమావాస్య.. ప్రాశస్త్యం తెలుసా?


