హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,670 మంది భక్తులు దర్శించుకోగా.. 33,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.