WG: భీమవరం పట్టణంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ వంతెనపై గురువారం గుర్తుతెలియని వృద్ధుడు (65) రోడ్డుపై పడి గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో భీమవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఒకటో పట్టణ సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరం ఫ్లైఓవర్ పై వృద్ధుడి మృతి


