హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘దసరా ఉత్సవాల్లో భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి’

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్‌, ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి కోరాయి. ఈ మేరకు దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందించారు. రూ.25 కోట్ల ఉత్సవ ఖర్చుల అంచనాలను బహిర్గతం చేయాలని, వీఐపీ దర్శనాలను కట్టడి చేసి సామాన్యులకు సులభ దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.