హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMSలో బెడ్‌ల కొరత.. అత్యవసర రోగులకు అవస్థలు!

HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో బెడ్‌ల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగానికి వచ్చే వారిలో 40-50 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రిఫర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బెడ్‌లు, వెంటిలేటర్ల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. గుండెపోటు వంటి అత్యవసర కేసుల్లో ప్రతి సెకను కీలకం కావడంతో సకాలంలో చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.