HYD: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో CT స్కాన్ సేవలకు ఓపీ రోగులు 20 రోజుల నుంచి నెల వరకు వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. రెండు ఆసుపత్రుల్లో రెండేసి యంత్రాలు ఉన్నా తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ఓపీ రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నట్లు రోగులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
గాంధీ, ఉస్మానియాలో CT స్కాన్‌కు నెల రోజుల నిరీక్షణ!


