హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైనథ్ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: జైనథ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, రిసెప్షన్ పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంజాయి, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. బాధితుల పట్ల గౌరవంగా మెలిగి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.