హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఆధునిక పద్ధతులతో ఎల్‌నినోను ఎదుర్కొందాం'

SRCL: వేములవాడ 3వ వార్డు లక్ష్మీపురంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని అధునాతన సాగు పద్ధతులతో ఎదుర్కోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని, కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించాలని అన్నారు.