హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల ఆవేదన

WGL: పర్వతగిరి మండలంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఫర్టిలైజర్‌ యాప్‌లో బుకింగ్‌, స్లాట్‌ ప్రక్రియ క్లిష్టంగా మారడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ యాప్‌ ప్రక్రియ పూర్తి కాక బస్తాలు అందడం లేదని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.