హైదరాబాద్: 28°C
తెలంగాణ

సివిల్ సప్లై తనిఖీలకు నిరసనగా మిల్లింగ్ బంద్

NRML: సివిల్ సప్లై అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్లు, తనిఖీలు, వేధింపులకు నిరసనగా నేటి నుంచి జిల్లాలో రైస్ మిల్లింగ్, ప్రొడక్షన్‌ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు రైస్ మిల్లేర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే. వెంకట్రావు తెలిపారు. మిల్లింగ్‌లో సహజంగా వచ్చే నష్టాలను రికవరీలో పరిగణించాలని, రబీ ధాన్యానికి బాయిల్డ్ రైస్ కోటా ఇవ్వాలని కోరారు.