హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడల్ స్కూల్‌గా బాపట్ల మున్సిపల్ హైస్కూల్

BPT: మున్సిపల్ హైస్కూల్‌ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి నియోజకవర్గ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మంత్రి లోకేష్‌ను కోరారు. పాఠశాల ఆధునీకరణకు ఇప్పటికే రూ.1.48 కోట్లు, పీఎం పోషణ్ కింద రూ.16 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 24 తరగతి గదులు, డైనింగ్ హాల్, ఆధునిక వంటగది, సైన్స్ ల్యాబ్‌లు నిర్మించామని వెల్లడించారు.