PPM: బాల సంజీవని పథకం రూ.172.80 కోట్ల టెండర్లలో పారదర్శకత లోపించిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ ఆరోపించారు. ఐదు పెద్ద సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు రూపొందించారని, 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేశారని విమర్శించారు. టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'టెండర్లలో అక్రమాలపై విచారణ జరపాలి'


