హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

విజయనగరంలోని పీఎస్ఆర్ కాలనీ, 43వ డివిజన్ ఉడా కాలనీ గాంధీ పార్క్‌లో వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని అన్నీ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.