హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నవరాత్రుల్లో డీజేలు నిషేధం: డీఎస్పీ

BDK: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు పెట్టకూడదని డీఎస్పీ ఆదినారాయణ సూచించారు. నిమజ్జనాల్లో డీజేలు నిషేధంలో ఉన్నాయన్నారు. మండపాల నిర్వాహకులు ట్రాఫిక్, అత్యవసర వాహనాలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.