GDWL: గద్వాల పట్టణం 21వ వార్డులో నల్లకుంట ప్రాంతంలో కార్పెంటర్ వీరన్న చారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కల గుంపు ఆయనను వెంబడించి దాడి చేశాయి. ఈ ప్రమాదంలో ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోవడంతో భుజం ఎముక విరగి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కల సమస్యపై కౌన్సిలర్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
గద్వాల పట్టణంలో వీధి కుక్కల దాడి


