హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15 వరకు 'ఇన్‌స్పైర్' నామినేషన్ల గడువు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ అవార్డ్స్‌ నామినేషన్లను ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఐ.విజయకుమారి సూచించారు. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు నామినేషన్లు పంపాలని స్పష్టం చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు అర్హులని, నామినేషన్లు నమోదు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.