KDP: కమలాపురం మండలం చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో మేరీ అనే మహిళపై పక్కింటికి చెందిన జయరాజ్ (కన్నా) కత్తితో దాడి చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవ నేపథ్యంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మేరీని చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చదిపిరాళ్లలో మహిళపై కత్తితో దాడి


