హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ప్రకాశం జిల్లా అధికారులకు శిక్షణ

ప్రకాశం: ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఎస్ఈ కే. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఉమ్మడి ప్రకాశం ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వినియోగం, విద్యుత్ నష్టాల నియంత్రణ, మీటర్ రీడింగ్‌లో పారదర్శకత, వినియోగదారుల సమాచార విశ్లేషణపై అవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని తెలుపారు.