హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

32 వార్డుల జాబితా విడుదల అభ్యంతరాల స్వీకరణ

NTR: నందిగామ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా విభజించిన 32 వార్డులకు సంబంధించిన 64 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశారు. ఆర్డీవో, పోస్టల్, సబ్‌రిజిస్ట్రార్, జిల్లా కోర్టు, కలెక్టర్ కార్యాలయాలతో పాటు సచివాలయాల్లోనూ జాబితాలను అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.