హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికంగా మాత్రలు వాడి మహిళ మృతి

NGKL: లింగాల మండలం పద్మానపల్లి గ్రామంలో మోతాదుకు మించి మందులు వాడటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జ్యోతి (26) వైద్యుల సలహా లేకుండా అధిక మొత్తంలో మాత్రలు వాడటంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి నలుగురు సంతానం ఉన్నారు.