హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలి'

SRCL: సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం, విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు మిర్యాలకర్‌ బాలాజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.