హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనాలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

HYD: వినాయక నిమజ్జనాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి తాము వ్యతిరేకం కాదని  స్పష్టం చేశారు. అమీన్ పూర్, కాప్రా చెరువుల్లో మాత్రమే ఆంక్షలు విధించామన్నారు.  నిమజ్జనాలపై సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పునరుద్దరిస్తున్న చెరువుల్లో ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.