హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి'

ASR: ప్రతి పంచాయతీలో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.