హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరును తడిపిన ఈదురుగాలుల వాన

గుంటూరు నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా, పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు.