VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్న ప్రసాద పథకానికి భక్తుడు రామనాధ్ బాబు గురువారం రూ.1,00,000లను విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు నగదును అందించారు. దీంతో దాతకు దేవస్థాన అధికారులు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి విరాళం


