KKD: పెద్దాపురంలో మున్సిపల్ ఎన్నికల ముందు వైసీపీ కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది మాజీ కౌన్సిలర్లు, ఇద్దరు టౌన్ ఉపాధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు గురువారం పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కి లేఖ రాశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన వెంటే పలువురు రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్..పలువురు రాజీనామా!


