హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

SRPT: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గాపురం స్టేజ్ సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఒక లారీని వెనుక నుంచి మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీల క్యాబిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అక్కడ 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిల్చిపోయాయి.