KMR: రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించినట్లు నాగిరెడ్డిపేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు రైతు బీమా కలిగిన రైతులు 2026 ఆగస్టు 14 తర్వాత మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన కుటుంబాలకు రైతు బీమా ప్రయోజనం అందుతుందని తెలిపారు.
తెలంగాణ
రైతు బీమా పథకం పునరుద్ధరణ


