NRPT: కృష్ణ మండలం చేగుంటకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణ మండలానికి చెందిన శివు బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లి కార్ వాష్ కేంద్రంలో పనిచేస్తున్నాడు. గురువారం రూములోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య


