హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల నమోదు ప్రక్రియను పరిశీలించిన కమిషనర్

NLR: ఆత్మకూరు మున్సిపాలిటీలో పెన్షన్ లబ్ధిదారుల ఆన్ లైన్ వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ గురువారం పరిశీలించారు. సచివాలయంలో లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనలు మేరకే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వెరిఫికేషన్ లో జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.