హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ విగ్రహాల కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు

MDCL: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్, ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓతో కలిసి ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్ విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. విగ్రహాల తయారీదారులు, విక్రేతలు, రవాణాదారులు విగ్రహాలను సురక్షితంగా తరలించాలని సూచించారు. నిర్దేశిత ఎత్తు, రవాణా మార్గాల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.